అవినీతి జలగలు
చక్రం తిప్పుతున్న ఫోర్‌మెన్ జీహెచ్ఎంసీలోని ఇతర విభాగాల్లో బదిలీలు కాస్త ఆలస్యమైనా తప్పకుండా జరుగుతున్నప్పటికీ, ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఇప్పటి వరకు బదిలీలే లేకపోవడం గమనార్హం. కవాడిగూడలోని ఓ ఫోర్ మెన్ సుమారు 20 ఏండ్ల నుంచి అకడే కొనసాగుతూ, గతంలో స్పేర్ పార్ట్స్ సీం వెలుగులోకి వచ్చినప్పుడు తన కింది స్థాయి ఉద్యోగిని బలి చేసి, తాము తప్పించుకొని కీలకమైన అధికారిని మేనేజ్ చేసుకొని మళ్లీ కవాడిగూడ ఫోర్ మెన్ పోస్టింగ్‌ను దకించుకుని హవా చెలాయిస్తున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.
- బల్దియా ట్రాన్స్‌పోర్టులో అక్రమార్కులు
- డీజిల్ కూపన్ల నుంచి అద్దె వాహనాల వరకు అక్రమాలు
- కవాడిగూడలో కొనసాగుతున్న దందా
- దశాబ్దాలుగా బదిలీలకు నోచుకోని వైనం
- ఫిర్యాదులున్నా..చర్యలు శూన్యం
చక్రం తిప్పుతున్న ఫోర్‌మెన్ జీహెచ్ఎంసీలోని ఇతర విభాగాల్లో బదిలీలు కాస్త ఆలస్యమైనా తప్పకుండా జరుగుతున్నప్పటికీ, ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఇప్పటి వరకు బదిలీలే లేకపోవడం గమనార్హం. కవాడిగూడలోని ఓ ఫోర్ మెన్ సుమారు 20 ఏండ్ల నుంచి అకడే కొనసాగుతూ, గతంలో స్పేర్ పార్ట్స్ సీం వెలుగులోకి వచ్చినప్పుడు తన కింది స్థాయి ఉద్యోగిని బలి చేసి, తాము తప్పించుకొని కీలకమైన అధికారిని మేనేజ్ చేసుకొని మళ్లీ కవాడిగూడ ఫోర్ మెన్ పోస్టింగ్‌ను దకించుకుని హవా చెలాయిస్తున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.
సిటీబ్యూరో, జూన్ 12(నమస్తేతెలంగాణ) : బల్దియా ట్రాన్స్‌పోర్టు విభాగం అవినీతి అక్రమాలకు అడ్డాగా మారింది. వివిధ హోదాల్లో అధికారులు వినియోగించే వాహనాల మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. డీజిల్ కూపన్ల నుంచి అద్దె వాహనాల వరకు అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కవాడిగూడ ట్రాన్స్‌పోర్టు కేంద్రంగా వాహనాల మరమ్మతుల పేరిట కొందరి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నది. దశాబ్దాల తరబడి ఒకే స్థానంలో తిష్ట వేసిన ఓ ఫోర్‌మెన్ ఓ ఉన్నతాధికారి అండతో అన్నీ తానై చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఈ విషయమై స్వయంగా కమిషనర్‌కు ఫిర్యాదులు అందినా.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కమిషనర్ మొదలుకొని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల వరకు వివిధ హోదాల్లోని అధికారులు వినియోగించే వాహనాల వరకు.. కాలం చెల్లిన వాహనాల మరమ్మతుల పేరిట ఇక్కడ కోట్ల రూపాయల నిధులను దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా కవాడిగూడ ట్రాన్స్‌పోర్టు కేంద్రంగా వాహనాల మరమ్మతుల మాటున కొందరి దందా సాగుతున్నది.
దశాబ్దాల తరబడి ఒకే స్థానంలో తిష్ట వేసిన ఓ ఫోర్‌మెన్ అన్నీ తానై చక్రం తిప్పుతున్నట్లు స్వయంగా కమిషనర్‌కు ఫిర్యాదులు వచ్చినా.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించలేదు. బల్దియాలో అతి పెద్ద ట్రాన్స్ పోర్టు యార్డు అయిన కవాడిగూడలో కొందరు ఫోర్ మెన్లు నియామకం మొదలు.. నేటికీ సుమారు మూడు దశాబ్దాలు గడుస్తున్నా.. అకడే కొనసాగిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా ఏండ్లుగా ఇకడ తిష్ట వేసిన ఫోర్మెన్లు తమ ఇష్టారాజ్యంగా ఇండెంట్లు రాసుకొని, క్యాష్ చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
దశాబ్దాలుగా తిష్ట
ట్రాన్స్ పోర్టు విభాగం హెడ్ ఆఫీసులో మే 16, 1992లో ఫోర్‌మెన్‌గా విధుల్లో చేరిన ఓ ఉద్యోగి వచ్చే 2033 ఫిబ్రవరి 28న రిటైర్డు కావాల్సి ఉంది. కానీ ఆయన విధుల్లో చేరిన మే 16, 1992 నుంచి ఎలాంటి బదిలీలు గానీ, పదోన్నతులు గానీ లేకుండా ఒకే సీటులో కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. అదే శానిటేషన్ విభాగంలో ఏండ్లుగా విధులు నిర్వహిస్తున్న శానిటరీ జవాన్లను కొన్ని నెలల కిందట అప్పటి కమిషనర్ కే. ఇలంబర్తి బదిలీలు చేసి, సంచలనం సృష్టించినా.. ఆయన ట్రాన్స్ పోర్టు విభాగంలోని లాంగ్ స్టాండింగ్‌లపై దృష్టి సారించలేకపోయారు. ఆయన దృష్టి సారించే సమయానికి బదిలీ అయినట్లు టాక్ లేకపోలేదు. ప్రస్తుతం ప్రతి మూడు నుంచి అయిదేళ్లలో అన్ని విభాగాల్లోని అధికారులు, సిబ్బందికి బదిలీలు అవుతుంటే, ఆ బదిలీలు ట్రాన్స్ పోర్టు విభాగానికి ఎందుకు వర్తించదని ఇతర విభాగాల ఉద్యోగులు, ఆఫీసర్లు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

