ఉప్పల్, ఏప్రిల్ 25: చిల్కానగర్ డివిజన్ కుమ్మరి కులస్తుల వైకుంఠధామం (Vaikuntadhamam) పనులు పూర్తి చేశామని, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. చిల్కానగర్ డివిజన్లోని కుమ్మరి కులస్తుల వైకుంఠధామంలో అన్ని హంగులతో పనులు పూర్తి చేశామని, అతి త్వరలో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డితో కలిసి ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ అధికారులు డిఈ వినీల్ గౌడ్, ఏఈ రాధికతో కలిసి కుమ్మరి కులస్తుల వైకుంఠధామం పనులను కార్పొరేటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి వైకుంఠధామాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. గత 40 సంవత్సరాల నుంచి కుమ్మరి కులస్తుల ప్రత్యేక వైకుంఠధామం ఒక కలగా మిగిలిపోయిందని అన్నారు.
కుమ్మరి కులస్తులకు ప్రత్యేక వైకుంఠధామాన్ని ఏర్పాటు చేయాలని, వారి ప్రతిప్రాధనను పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం కుమ్మరి కులస్తుల కుల సంఘం నాయకులు మాట్లాడుతూ కుమ్మరి కులస్తులకు ప్రత్యేకమైన వైకుంఠధామం ఏర్పాటు చేయడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. కుమ్మరి కులస్తుల సంఘం నాయకులు అడిగిన వెంటనే ప్రత్యేక వైకుంఠధామాన్ని అతి స్వల్ప సమయంలో ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయమని చెప్పారు. కుమ్మరి కులస్తులు ఎప్పటికీ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ కి రుణపడి ఉంటామని, వారి నాయకత్వాన్ని బలపరుస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ కేదార్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎద్దుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, బాలకృష్ణ గౌడ్, బుద్ధం శ్రీనివాస్ యాదవ్, శ్యామ్, కుమ్మరి సంఘం నాయకులు గుమ్మడిల్లి మల్లేష్, గుమ్మిడేల్లి యాదయ్య, మహేష్, పెంటయ్య, భాస్కర్, అశోక్, జంగయ్య పాల్గొన్నారు.