సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీద నుంచి రాయలసీమ వరకు ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో నగర వాతావరణం కొంత చల్లబడింది. దీంతో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 39, కనిష్ఠం 30 డిగ్రీలు, గాలిలో తేమ 25 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆవర్తనం కారణంగా గ్రేటర్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.
ఆవర్తనం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నగరానికి ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు.