Contractors | ప్రత్యేక అధికారుల పాలనలో అప్పులు చేసి మరి పనులు చేశాం. మా బిల్లులు చెల్లించండి సారూ అంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లంతా నిరసన బాట పట్టారు.
నిజామాబాద్-భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో అధికారుల పాలన సమయంలో కాంట్రాక్టర్లు చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో కాంట్రాక్టర్లంతా తమ పెండింగ్ చెల్లించాలంటూ గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.
అప్పులు చేసి గ్రామపంచాయతీకి పనులు చేశామని ఎన్నిసార్లు అడిగిన అధికారులు పట్టించుకోవడంలేదంటూ కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గ్రామపంచాయతీ నిధుల నుండి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేశారు.
బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్ల నిరసన
నిజామాబాద్ – భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో అధికారుల పాలన సమయంలో చేసిన పనులకు బిల్లులను చెల్లించాలంటూ గ్రామపంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్లు
అప్పులు చేసి గ్రామపంచాయతీకి పనులు చేశామని ఎన్నిసార్లు అడిగిన అధికారులు… pic.twitter.com/2PXmsQCAp3
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2026
బండి భగీరథ్‌పై పోలీసులు కావాలనే చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు : అడ్వకేట్ లలితా రెడ్డి
KTR | విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం.. నీట్ రద్దుపై కేటీఆర్