ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 29: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ డిమాండ్ చేసింది. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలను కలిసి వినతి పత్రాలు అందజేశారు.
అనంతరం, కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ తమను రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకు తమకు బేసిక్ పే, డీఏ, హెచ్ఆర్ఏతో కూడిన పే స్కేళ్లను వెంటనే అమలు పరచాలని కోరారు. త్వరలోనే వర్సిటీలకు వీసీలను నియమిస్తామని, వర్సిటీలలో ఖాళీగా ఉన్న అధ్యాపక, అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమం త్రి ప్రకటించారని గుర్తు చేశారు. అనేక ఏళ్లుగా వర్సిటీలనే నమ్ముకుని పరిశోధన, బోధనపై ఆసక్తితో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు.
గత ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో విశ్వవిద్యాలయాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్సిటీల కాంట్రాక్ట్ అధ్యాపకులకు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభు త్వ పెద్దలను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడం శోచనీయమన్నారు. తాము చేయాల్సిన విధులే కాకుండా మరెన్నో అదనపు బాధ్యతలను తాము మోస్తున్నట్టు వారు తెలిపారు. అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో అన్యాయానికి గురవుతూ జీవితాలను కొనసాగిస్తున్నామని వాపోయారు.
తమ కు యూజీసీ పేస్కేల్ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 వర్సిటీలలో మొత్తం అధ్యాపక పోస్టుల ఖాళీలు 2,205 ఉండగా, కాంట్రాక్ట్ అధ్యాపకులు 1,445 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. వారి పోస్టులకు రక్షణ కల్పించి, మిగిలిన పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కాం ట్రాక్ట్ అధ్యాపకుల సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉందని మంత్రులు చెప్పారని అన్నారు.
త్వరలోనే వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ అధ్యాపక సం ఘాల నాయకులు డాక్టర్ విజయేందర్ రెడ్డి, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ సురేశ్ నాయక్, డాక్టర్ దత్తహరి, డాక్టర్ సాదు రాజేశ్, డాక్టర్ కనకయ్య, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సనత్, డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు.
నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహకరం
మాదాపూర్, ఆగస్టు 29: నగరం పెట్టుబడుల కు అనుకూలమని, దేశంలోని పలు మేనుఫ్యాక్చరింగ్ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చి యూనిట్లను ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వం అన్ని విధా ల ప్రోత్సహిస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బా బు అన్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో గురువారం సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ ట్రేడర్స్ అసోసియేషన్ (సెటా) ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఎక్స్ పో-2024కు చెందిన 5వ ఎడిషన్‌ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు విచ్చేసి సీఐఐ, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సి.శేఖ ర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు వి.రాజశేఖర్‌రెడ్డిలతో పాటు నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించడం జరిగిం ది.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, దేశంలోని పలువురు మ్యానుఫాక్చరింగ్ కంపెనీలకు చెందిన యూనిట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వం అన్ని విధాల అండ గా ఉంటూ ప్రోత్సహిస్తుందన్నారు. కొత్త ఆవిష్కరణలను తీసుకువచ్చిన వారికి ప్రభుత్వం తరుపున ప్రోత్సాహం ఇస్తామన్నారు. అనంతరం, ఈ నెల 31వ తేదీ వరకు జరగనున్న ఈ ఎక్స్ పోలో పాలిక్యాబ్, ఫైన్ క్యాబ్, జెమ్స్, ఎలెంటి, ఫై బ్రోస్, కేఈఐ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 15 నుంచి 20 వేల మంది సందర్శకులు విచ్చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.