HCU Strike | హెచ్సీయూలో కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులు తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిపాలనా విభాగం ఎదుట మరోసారి నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల తాము తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ చట్టాల అమలుతో తమకు ఉద్యోగ భద్రత కరువైందని, కార్యాలయంలో రక్షణలు బలహీనపడ్డాయని కాంట్రాక్ట్ కార్మికులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా తాము పోరాడి సాధించుకున్న ప్రాథమిక కార్మిక హక్కులను సైతం ఈ కొత్త చట్టాల సాకుతో అణచివేస్తున్నారని.. వర్సిటీలో కొత్త కాంట్రాక్టర్ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే వర్సిటీకి వచ్చిన కొత్త కాంట్రాక్టర్ నియామకంతో పరిస్థితి మరింత కష్టంగా మారిందని వాపోతున్న కార్మిక సంఘాల నాయకులు కొత్త కాంట్రాక్టర్ ఈ కార్మిక చట్టాల నిబంధనలను ఆసరాగా చేసుకుని, మాకున్న పాత హక్కులను, ప్రయోజనాలను పూర్తిగా రద్దు చేశారని ఆరోపించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేదే లేదని అల్టిమేటం జారీ చేశారు. వర్సిటీ యాజమాన్యం తక్షణమే స్పందించి, తమతో చర్చలు జరపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
హెచ్సీయూలో కాంట్రాక్ట్ కార్మికులు నిరవధిక సమ్మె
తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిపాలనా విభాగం ఎదుట మరోసారి నిరసనకు దిగిన కాంట్రాక్ట్ కార్మికులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల వల్ల తాము తీవ్ర సంక్షోభంలో… pic.twitter.com/H1smQYRy8B
— Telugu Scribe (@TeluguScribe) June 30, 2026