వైద్య ఖర్చులు చెల్లించని బీమా సంస్థకు జరిమానా
ముషీరాబాద్‌కు చెందిన శివరామప్రసాద్ విశ్రాంత ఉద్యోగి. ఆంధ్రాబ్యాంక్ రిటైరీస్ పేరుతో విశ్రాంత ఉద్యోగుల కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు
సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ముషీరాబాద్‌కు చెందిన శివరామప్రసాద్ విశ్రాంత ఉద్యోగి. ఆంధ్రాబ్యాంక్ రిటైరీస్ పేరుతో విశ్రాంత ఉద్యోగుల కోసం యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నారు. పాలసీ ప్రకారం రూ.9లక్షల వరకు వైద్య చికిత్స పొందవచ్చు. శివరామప్రసాద్‌కు 2020లో కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో ఆగస్టు 7న దవాఖానలో చేరి చికిత్స పొంది దవాఖాన వైద్య ఖర్చులు మొత్తం రూ.4,51,555 చెల్లించి డిశ్చార్జి అయ్యారు.
అనంతరం వైద్య బీమా చెల్లింపుల కోసం సదరు సంస్థను సంప్రదించగా వారు మొదటి విడతలో రూ.1,81,507, రెండో విడతలో రూ.1,34,298 కలిపి మొత్తం రూ.3,15,805 చెల్లించారు. మిగతా రూ.84,195 రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉండగా నిరాకరించారు. దీంతో బాధితుడు వినియోగదారుల కమిషన్‌లో కేసు వేశారు. హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బీ.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సీ.లక్ష్మిప్రసన్న, నారాయణరెడ్డితో కూడిన బెంచ్ కేసును పరిశీలించి, ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం పాలసీదారుడికి రీయింబర్స్మెంట్ కింద రూ.84,195 చెల్లించాల్సిందేనని తెలిపారు. రీయింబర్స్మెంట్ నిరాకరించినందుకు రూ.20వేలు జరిమానా విధించి, కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు అందజేయాలని సూచించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Claim
- Consumer forum
- Delay
- Fine
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

