సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ఉస్మానియా మార్చురీ ఆధునీకరణ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 20 నుంచి 30 మృతదేహాలను భద్రపరిచే సామర్థ్యం ఉన్న ఉస్మానియా మార్చురీలో ప్రతి రోజు 10 నుంచి 12 పోస్టుమార్టమ్స్ జరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులతో తక్కువ సామర్థ్యం ఉన్న ఈ మార్చురీ వల్ల పోస్టుమార్టంలో జాప్యం జరగడమే కాకుండా మృతదేహాల భద్రత కూడా ఇబ్బందికరంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మార్చురీలను ఆధునీకరించేందుకు చర్యలు తీసుకున్న విషయం విదితమే.
అరెకరంలో ఆధునీకరణ పనులు
సుమారు అరెకరం విస్తీర్ణంలో ఉస్మానియా మార్చురీని నిర్మిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5.9 కోట్ల నిధులను విడుదల చేసింది. ఆరునెలల క్రితం ప్రారంభమైన మార్చురీ నిర్మాణ పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.
పెరగనున్న మార్చురీ సామర్థ్యం
ప్రస్తుతం ఈ మార్చురీలో 20 నుంచి 30 మృతదేహాలను మాత్రమే భద్రపరిచే సామర్థ్యం ఉంది. నూతనంగా అందుబాటులోకి రానున్న మార్చురీలో 70 మృతదేహాల వరకు భద్రపరిచే వీలుందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. ఒక్కో ఆధునిక ఫ్రీజింగ్ బాక్సుల్లో 10 నుంచి 15 మృతదేహాలను, సెం ట్రల్ ఏసీ సౌలభ్యమున్న పప్ రూమ్స్‌లో కూడా పదుల సంఖ్యలో మృతదేహాలను భద్రపర్చవచ్చని డాక్టర్ నాగేందర్ పేర్కొన్నారు.
24/7 పోస్టుమార్టం చేస్తున్నాం..
మార్చురీ ఆధునీకరణ పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఈ మార్చురీని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. 2.5కోట్లతో వైద్యపరికరాలు, 2.5కోట్లతో సివిల్ వర్క్స్ చేపడుతున్నాం. ఈ ఆధునిక మార్చురీ అందుబాటులోకి వస్తే డెడ్‌బాడీస్‌ను ప్రిజర్వ్ చేసే సామర్థ్యం 70 వరకు పెరుగుతుంది. ప్రస్తుత సామర్థ్యం 20 నుంచి 30 వరకే ఉంది.నూతన మార్చురీ అందుబాటులోకి వస్తే సామర్థ్యం పెరగడంతో పాటు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్‌కు మరింత నాణ్యమైన బోధన జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వైద్య విద్యార్థులకు డిసెక్టింగ్ వంటి శిక్షణ సులువు కానుంది. ఉస్మానియా మార్చురీలో 24/7 పోస్టుమార్టం ప్రారంభించాం. అయితే రాత్రి సమయంలో కేవలం యాక్సిడెంట్ తదితర కేసులకు పోస్టుమార్టం పోలీసుల సూచన మేరకు నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ బి.నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్
అందుబాటులోకి రానున్న సౌకర్యాలు