Home Minister Mahmood Ali | ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంది : హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
Minister Mahmood Ali | దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) ఆరోపించారు.
హైదరాబాద్ : దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీ ముస్లిం, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకు మాత్రమే వాడుకుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) ఆరోపించారు. శనివారం ఆజంపురాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం, మైనారిటీలకు మెరుగైన జీవనస్థితిగతులను కల్పించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమయ్యిందని విమర్శించారు. ఉన్నత విద్యాభ్యాసం అందించకుండా నిరక్ష్యరాసులు గా మిగిల్చిందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీల సంక్షేమానికి కేవలం రూ. 2,219.57 కోట్లు ఖర్చు చేయగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) 9 సంవత్సరాల్లో రూ.10,139.11 కోట్లను ఖర్చు చేశారని స్పష్టం చేశారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపారని ప్రశంసించారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటకలో 95 లక్షలు ఉన్న మైనార్టీలకు రూ. 2,100కోట్లు, రాజస్థాన్ (Rajasthan)లో 78.06లక్షలకు రూ. 1,973 కోట్లు, బిహార్లో 1.77కోట్ల మైనార్టీల జనాభాకు కేవలం రూ. 700కోట్లు, జార్ఖండ్లో 62.98లక్షలకు రూ. 320.8కోట్లు ఖర్చు చేశారని అన్నారు. దేశంలోని 25కోట్ల మైనార్టీల జనాభాకు కేంద్ర ప్రభుత్వం రూ. 3,097 కోట్లను మాత్రమే కేటాయించిందని ఆరోపించారు.
రాష్ట్రం వ్యాప్తంగా 204 మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను ఏకకాలంలో ఏర్పాటు చేసి నిరుపేదలైన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తుందని తెలిపారు. స్కూళ్లను అప్గ్రేడ్ చేస్తూ కాలేజీలను కూడా ఏర్పాటు చేశామన్నారు.
రేవంత్ రెడ్డిది ఆర్ఎస్ఎస్ భావజాలం..
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పూర్తిగా ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తని మహమూద్ అలీ ఆరోపించారు. మైనార్టీల పై కల్లబొల్లి వాగ్దానాలు చేస్తూ మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో పథకాల పేరుతో ఆకర్శించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని, మైనార్టీ డిక్లరేషన్ ద్వారా ఒరిగేది ఏమీ లేదన్నారు. అమలుకు సాధ్యం కాని పథకాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసేందుకు వాగ్దానాలను ఇస్తుందని విమర్శించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

