 
                                                            బంజారాహిల్స్, అక్టోబర్ 30: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతల ఎత్తుగడలు, అధికార దుర్వినియోగాలను ఎప్పటికప్పుడు గుర్తించి తమకు తెలియజేయాలని మజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. రహ్మత్‌నగర్ డివిజన్లోని 9మంది బీఆర్ఎస్ బూత్ ఇంచార్జీలతో గురువారం నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ప్రతి ఓటర్ను వ్యక్తిగతంగా కలిసి బీఆర్ఎస్ పాలనలో వచ్చిన లాభాలు, కాంగ్రెస్ పార్టీతో వచ్చిన నష్టాలను వివరించాలన్నారు, అధికారుల బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదని, అలాంటివాటిని వెంటనే పార్టీ దృష్టికి తెస్తే అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
 
                            