మేడ్చల్, నవంబరు 6 : బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం డబిల్పూర్కు చెందిన డీసీసీబీ మాజీ డైరెక్టర్ నీరుడి భాసయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపాల్, బ్యాగరి రాజు, కుమ్మరి శంకరయ్య, హిమామ్, అంబదాసు సోమవారం మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్కే సాధ్యమన్నారు.
ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా భారీ స్పందన వస్తున్నదన్నారు. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు గౌస్, మేడ్చల్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు విజయానంద రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సుదర్శన్, యూత్ అధ్యక్షుడు హరత్ రెడ్డి, డబిల్పూర్ మాజీ సర్పంచ్ రాజమల్లారెడ్డి, ఉప సర్పంచ్ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ, నాయకులు భాగ్యారెడ్డి, తలారి అశోక్, శ్రీరాంరెడ్డి, ఉప్పరి శ్రీనివాస్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.