సిటీబ్యూరో/మేడిపల్లి,జూన్ 29(నమస్తే తెలంగాణ) : గృహ ప్రవేశం చేస్తున్న ఇంటిపై దౌర్జన్యకాండ సాగించిన వారిలో కాంగ్రెస్ నాయకులే పాత్ర బయటపడింది. మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ ప్రధాన నాయకుల అనుచరులే గృహప్రవేశం చేస్తున్న వారిపై దౌర్జన్యకాండ సాగించారు. వీరిలో బోడుప్పల్‌కు చెందిన కాంగ్రెస్ యువ నేత రాజు అనుచరులు కీలక పాత్ర పోషించారు. దౌర్జన్యానికి దిగిన వారిలో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై హత్య యత్నం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలింపు చేపట్టారు.
బోడుప్పల్ దేవేందర్‌నగర్‌లోని శనివారం రాత్రి శ్యాంరావు తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి గృహప్రవేశానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడికి స్థానికుడైన యాకయ్య మద్యం మత్తులో వచ్చి శ్యాంరావుతో మాటలు కలిపాడు. ఈ క్రమంలో యాకయ్య మద్యం మత్తులో శ్యాంరావుతో వాగ్వాదానికి దిగడంతో, తమ ఇంటి వద్దకు వచ్చి మాతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నావంటూ ఆ ఇంటివాళ్లు సూచనలు చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన యాక య్య ఆటో డ్రైవర్ అయిన తన కొడుకు సాయికి ఫోన్ చేసి ‘నాపై కొట్టడానికి వస్తున్నారం’టూ చెప్పుకొన్నాడు. దీం తో సాయి 50 మందితో వచ్చి శ్యాం రావు ఇంటిపై దౌర్జన్యానికి దిగడంతో శ్యాంరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై శ్యాంరావు కొడుకు అనూప్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి 13 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

కాంగ్రెస్ నాయకుడే సూత్రధారి
స్థానికంగా రౌడీయిజం చేస్తూ, ప్లా ట్లు, ఇండ్లు అమ్ముతూ, ప్రభుత్వ స్థలాలను కాజేస్తున్న కాంగ్రెస్ ప్రధాన నాయకుల అనుచర గణమే ఈ దాడిలో పాల్గొన్నారని స్థానికులు చెబుతున్నారు. ఇం దులో ప్రధానంగా రాజు అనే కాంగ్రెస్ నాయకుడి పాత్ర ఉందంటూ ఆరోపణలు వస్తున్నాయి. బోడుప్పల్‌లోని 13వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు స్థానికంగా రౌడీయిజం చేస్తుంటాడని, అతనికి అనుచరులుగా సాయి, మిగతా వారు ఇలాంటి దాడులకు పాల్పడుతుంటారని స్థానికులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే యాకయ్య ఫోన్ చేయగానే మన మనిషులను ఎదురించేందెవరూ అంటూ రాజు తన అనుచరులందరిని జమ చేసి ఈ దాడికి పురమాయించాడనే ఆరోపణలు వస్తున్నాయి.
రాజేంద్రనగర్, దేవేందర్‌నగర్, రాజీవ్‌నగర్ ప్రాంతాలలో ప్రభు త్వం ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక పథకం ప్రకారం యాకయ్యతో గొడవ చేయించి, అనంతరం ఈ గ్యాంగ్ వచ్చి దౌర్జన్యానికి పాల్పడిందనే ఆరోపణలు వస్తున్నాయి. దేవేందర్‌నగర్‌లో ఇళ్లు కొన్న వ్యక్తి తమకు తెలియకుండా గృహప్రవేశం ఎలా చేస్తాడు, వాడికి ఎంత ధైర్యం అంటూ ఈ గ్యాంగ్ కోపం తో ఆ ఇంటిపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై రెండు వేరు వేరు కేసులు నమోదయ్యాయి.
ఒకటి శ్యాంరావు కొడుకు రూపేష్ ఫిర్యాదు ఇవ్వగా, మరొకటి అక్కడ జరుగుతున్న ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరి విష్ణుగౌడ్పై కూడా దాడి చేశారు. విష్ణుగౌడ్ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసు నమోదయ్యింది. అరెస్టయిన వారిలో వసురి సాయికుమార్ (33) పులి ప్రదీప్‌కుమార్ (32)కేమిడి రామకృష్ణ(23)కొమ్ము వేణు (21)ఆరుట్ల సుశాంత్‌రెడ్డి (25)తాటికాయల విష్ణు (23) కుంకుడు పాముల ఉదయ్‌కుమార్ (22)మహమ్మద్ అక్బర్ (25) మేడికొండ సంతోష్‌కుమార్ (24)కదురు సాయితేజ(21)ఆకునురి అరుణ్ (20)తొండ మహేశ్ (32) వసూరి యాకయ్య (60) లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ జలంధర్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పెట్రోలింగ్ పెంచుతామన్నారు. గంజాయి మూకల చర్యలను నిరోధిస్తామన్నారు.