ఎల్బీనగర్, డిసెంబర్ 19 : చైతన్యపురి డివిజన్లో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. డివిజన్లో అంతంత మాత్రంగానే ఉన్న కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు కూడా ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిపోతున్నారు. చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ప్రభాకర్, తిరుమల్రెడ్డిలు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంగా ఉందన్నారు.
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా ఐకమత్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. బీఆర్ఎస్లో చేరిన నాయకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట మహేష్ యాదవ్, సీనియర్ నాయకులు సొంటి చంద్రశేఖర్‌రెడ్డి, త్రివేది, పవన్, గట్టు శ్రీనివాస్, రమణారెడ్డి, వీరన్న యాదవ్, ప్రవీణ్‌చారి తదితరులు పాల్గొన్నారు.