కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 29: వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడంతో.. కాంగ్రెస్ నేతల్లో వణుకు మొదలైందని కూకట్పల్లి ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు ఎద్దేవా చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రజతోత్సవ వేడుకలకు రా ష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చారని.. దేశ చరిత్రలోనే వరంగల్ బీఆర్ఎస్ సభ లాంటి సభ జరగలేదన్నారు.
కేసీఆర్ సభ విజయవంతం కావడం తో తట్టుకోలేక.. కాంగ్రెస్ మంత్రులు ఆగమేఘాల మీద ప్రెస్ మీట్లు పెట్టి జనాలు రాలేదని, బాహుబలి సెట్టింగ్ అని చెప్పడం సిగ్గుచేటన్నారు. సిగ్గు, శరం ఉంటే సభకు ప్రజలు వచ్చారా లేదో వరంగల్లోని మీ కాంగ్రెస్ పార్టీ నేతలని అడిగి తెలుసుకోవాలని విమర్శించారు. 420 హామీలు ఇచ్చిన కాం గ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని 20 హామీలను కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడిన వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.