ఖైరతాబాద్, అక్టోబర్ 22: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి క్రైస్తవులు ఓటు వేయవద్దని క్రిస్టియన్ పొలికల్ ఫ్రంట్ అధ్యక్షుడు జెరూసలేం మత్తయ్య పిలుపునిచ్చారు. క్రిస్టియల్ పొలిటిక్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బలపర్చిన అభ్యర్థి వీఎస్ ఫెల్లా అనే మహిళతో బుధవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించారు.
అనంతరం మత్తయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు క్రిస్టియన్ మైనార్టీ డిక్లరేషన్ పేరుతో పాస్టర్లకు వేతనాలు, క్రైస్తవుల రక్షణకు ప్రత్యేక చట్టం, నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం, క్రిస్టియన్ భవన నిర్మాణం, క్రైస్తవులపై జరుగుతున్న దాడులను నిలువరించకపోవడం లాంటి చర్యలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని మత్తయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఓయూ క్రిస్టియన్ విభాగం చైర్మన్ గడ్డం అశోక్, ఓబులేష్ పాల్గొన్నారు.