Saidabad | సైదాబాద్, జూలై 3 : ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణికాలనీ వివాదస్పద స్థలంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న గుడిసెవాసులందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందనను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సైదాబాద్ మండల పరిధిలోని ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సింగరేణికాలనీ సర్వేనెంబర్ 65 నుంచి 77 వరకు, 133 పార్ట్‌లోని 25 ఎకరాల స్థలంలో గుడిసెల్లో ఉండే వారందరికీ పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలన్నారు. జిల్లాల నుంచి వలస వచ్చిన పేదలు గుడిసెలు వేసుకొని అందులో జీవిస్తున్న వారందరికీ ఆధార్, ఓటర్, రేషన్ కార్డులు ఇచ్చి, స్థానికంగా గుడిసెల్లో సీసీ రోడ్లు, కరెంట్ వంటి సౌకర్యాలు కల్పించిన అధికారులు పట్టా సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి గుడిసెవాసులకు ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.