సిటీబ్యూరో/సుల్తాన్ బజార్, మార్చి 16,(నమస్తే తెలంగాణ): పదేండ్ల కాలంపాటు పేద ప్రజలకు వరమైన కేసీఆర్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నది. పనిగట్టుకొని మరీ వాటి పేర్లు మార్చడం తప్ప.. అమలు మాత్రం తూతూ మంత్రంగా చేస్తున్నది. కొన్ని పథకాలైతే కనిపించకుండా పోవడం గమనార్హం. అలాంటి పథకాల్లో ఒకటైన కేసీఆర్ కిట్ ను కాంగ్రెస్ సర్కారు మెటర్నల్ ఛైల్డ్ హెల్త్ స్కీం గా పేరు మార్చి ఆ పథకాన్ని నీరు గార్చింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు కేసీఆర్ కిట్ పేరును మార్చి ఎంసీహెచ్ స్కీం పేరుతో అమలు చేసింది. పథకం పేరు మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయడంలో విఫలమైంది. 2024 ఫిబ్రవరి నుంచి నేటి వరకు ఎంసీహెచ్ కిట్లు నిలిపేయడంతో లబ్ధిదారులంతా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ఇస్తామన్న ఎంసీహెచ్ కిట్ కోసం ఏడాది కాలంగా నిరాశతో ఎదురుచూస్తున్నారు.
కింగ్కోటీలోని మెటర్నిటీ వైద్యశాలలో 2024 ఏడాది నుంచి జనవరి వరకు నమోదైన డెలివరీ కేసుల వివరాలివీ
2017 నుంచి 2024 వరకు ప్రభుత్వ మెటర్నిటీ వైద్యశాలలో కేసీఆర్ కిట్(ఎంసీహెచ్ కిట్) వివరాలు..