సిటీ బ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు నమ్మద్రోహం చేసిన కాంగ్రెస్ను ఓడిచించాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ నేతలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలిస్తామని అరచేతిలో స్వర్గం చూపించి మోసం చేశారని మండిపడ్డారు. రెండేండ్ల నుంచి నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాలను వేధిస్తున్న కాంగ్రెస్ను జూబ్లీహిల్స్లో ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.