KTR | కేసీఆర్ పాలనలో ఐటీ అద్భుతంగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం వచ్చారని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో కూడా అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌లో అనేక నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. 42 ఫ్లైఓవర్లు నిర్మించుకున్నామన్నారు. 70 కిమీ మేర మెట్రో నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజా రవాణాను ఇంకా మెరుగుపరచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా షేక్‌పేటలోని ఆదిత్య ఎంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీ వాసులతో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, జాజుల సురేందర్ రెడ్డితో కలిసి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చిందని కేటీఆర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క సీటు గెలవలేదని గుర్తుచేశారు. హైదరాబాద్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని అన్నారు. గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్ర అద్భుతంగా పోషిస్తున్నామని పేర్కొన్నారు. మా శాసనసభ్యులు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తూ వస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా మాగంటి సునీతమ్మకు టికెట్ ఇచ్చామన్నారు.
కేసీఆర్ పాలనలో ఐటీ అద్భుతంగా అభివృద్ధి చెందిందని కేటీఆర్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం వచ్చారని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో కూడా అవకాశంగా తీసుకుని హైదరాబాద్‌లో అనేక నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. 42 ఫ్లైఓవర్లు నిర్మించుకున్నామన్నారు. 70 కిమీ మేర మెట్రో నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజా రవాణాను ఇంకా మెరుగుపరచాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ రంగంలో కూడా పంజాబ్, హర్యానాను తలదన్నేలా అభివృద్ధి జరిగిందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో ఇది సాధ్యమైందని అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
షేక్ పేటలోని ఆదిత్య ఎంప్రెస్ గేటెడ్ కమ్యూనిటీ వాసులతో సమావేశం
కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి @VPR_BRS, మాజీ ఎమ్మెల్యేలు @JeevanReddyBRS, జాజుల సురేందర్
కేటీఆర్ కామెంట్స్..
♦️మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో… pic.twitter.com/2m6OjmSgLP
— BRS Party (@BRSparty) November 2, 2025
కేసీఆర్ పాలన కంటే ముందు అపార్ట్మెంట్లలో జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లు కనబడేవని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో కరెంటు కోతలు, నీళ్ల కటకట లేకుండా చేశామని తెలిపారు. హరితహారంతో రాష్ట్రాన్ని గ్రీన్ ఎకానమీగా మార్చామన్నారు. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలతో అన్ని వర్గాలు లబ్ధి పొందాయని అన్నారు. గంగా జమున తెహజీబ్ సంస్కృతిని కాపాడే ప్రయత్నం చేశామన్నారు.
అర చేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్ నాయకులు గ్రామీణ ప్రజలను మోసం చేశారని కేటీఆర్ అన్నారు. అయినా కేవలం ఒకటిన్నర శాతం తేడాతో బీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. విద్యావంతులు ఉన్న హైదరాబాద్‌లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని. ఇది బాధాకర విషయమని వ్యాఖ్యానించారు. మీరు ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోతే రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.