అల్లాపూర్, నవంబర్7: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ అధ్యక్షుడు ఖాజా ముజీబుద్దీన్ అన్నారు. శుక్రవారం బోరబండలోని పలు మసీదుల వద్ద మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దుతుగా బీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు ఖాజా బద్రుద్దీన్తో కలసి ఆయన ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ముస్లిం మైనారిటీలకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మసీద్‌లోని ఇమామ్‌లు, మౌజమ్‌లకు వేతనాలు ఇచ్చి వారి అభ్యున్నతికి కృషిచేశారని గుర్తుచేశారు. ఇక రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఉప ఎన్నికలో కారుగుర్తుకు ఓటు వేసి మాగంటి సునీతా గోపీనాథ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
అమీర్‌పేట్, నవంబర్ 7: కాంగ్రెస్ పాలనలో మైనారిటీలు పూర్తిగా మోసపోయారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. మోసపోయిన మైనారిటీలు తమ సత్తా చాటేందుకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చక్కటి అవకాశంగా మలుచుకుంటున్నారన్నారు. మైనారిటీలను కించపరిస్తేదాని పర్యవసానాలెలా ఉంటాయనేది రేవంత్ సర్కార్‌కు 14న వెలువడే ఉప ఎన్నిక ఫలితంతో తెలిసి వస్తుందన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ సుల్తాన్నగర్లోని మహ్మదీయ మసీదు వద్ద ప్రార్థ్ధనలు ముగించుకుని వస్తున్న ముస్లిమ్ సోదరులను కలిసి ఉప ఎన్నికలో బీఆర్ఎస్కు మద్దతు పలుకాల్సిందిగా అభ్యర్థించారు. బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని పల్లా ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్,నవంబర్7: బీఆర్ఎస్తోనే మైనారిటీల సంక్షేమం సాధ్యమని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మసీదులలో ప్రార్థనల అనంతరం శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్‌కు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధ్ది పనులను వివరించే కరపత్రాలను నవీన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
జూబ్లీహిల్స్, నవంబర్ 7: యూసుఫ్‌గూడ డివిజన్ వెంకటగిరిలో శుక్రవారం మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
అల్లాపూర్, నవంబర్7: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఓటర్లను కోరారు. శుక్రవారం బోరబండ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నేత ముట్టు శివ తదితరులు ఉన్నారు.
కాప్రా, నవంబర్ 7: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా శుక్రవారం సోమాజిగూడ డివిజన్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రచారంలో ఎలా ముందుకు వెళ్లాలి తదితర అంశాలపై నేతలకు లక్ష్మారెడ్డి దిశానిర్దేశం చేశారు. మల్లాపూర్, హెచ్‌బీకాలనీ డివిజన్ కార్పొరేటర్లు పి.దేవేందర్‌రెడ్డి, జే.ప్రభుదాస్, బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్‌శేఖర్ తదితరులు పాల్గొన్నారు.