ఖైరతాబాద్/కాచిగూడ/ఉస్మానియా యూనివర్సిటీ: 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నిలువునా మోసగించిందని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలను బొందపెడితేనే బీసీల బతుకులు మారుతాయని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం 24న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయాల ఎదుట శాంతియుత ధర్నా చేయనున్నట్లు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ తెలిపారు. చట్టపరంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లెపల్లి స్వామిగౌడ్ డిమాండ్ చేశారు.