2031 లక్ష్యంగా సిటీలో చేపట్టిన కాంప్రహెన్సివ్ ట్రాన్స్పోర్టు స్టడీ సూచనలు అమల్లోకి తీసుకొస్తే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరే అవకాశముంటుంది. ఇప్పటికే మెట్రో రైళ్లతో వేగంగా ప్రయాణించే వెసులుబాటు దొరికింది. కానీ రోడ్లపై వాహనాల రద్దీ తగ్గలేదు.
నగరంలో పెరుగుతున్న వెహికిల్ లోడ్, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రహదారులను విస్తరించాల్సి ఉంటుంది. ఆటోమెటిక్ ట్రాఫిక్ కౌంటర్ కమ్ క్లాసిఫైర్ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. నగరానికి అవసరమైన రవాణా వ్యవస్థల రూపకల్పనపై అధ్యయనం చేశారు. కానీ చేసిన అధ్యయనాలను అమలు చేయకపోవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రంగా మారుతున్నాయి.