హైదరాబాద్ : టాలీవుడ్ నటి సమంతపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చయాంశమైన సంగతి తెలిసిందే. నాగచైతన్య, సామ్ విడాకులపై కొండా సురేఖ మాట్లాడిన తీరుపట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే సమంత, నాగార్జునకు పలువురు మద్దతుగా నిలిచారు. తాజాగా మంత్రి తీరును నిరసిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల(BRSWomen corporators) ఫిర్యాదు చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
కాగా, తాను చేసిన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానని.. అన్యదా భావించకూడదని ఇప్పటికే ఎక్స్ ద్వారా నటి సమంతకు ట్వీట్ చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై డైరెక్టర్ రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. తన శైలిలో ట్వీట్ల వర్షం కురిపించాడు. కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటని ప్రశ్నించిన ఆర్జీవీ.. అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని అని అన్నాడు.