సిటీబ్యూరో, మార్చి 29 ( నమస్తే తెలంగాణ ) : ఉగాది, రంజాన్ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని రాచకొండ కమిషనర్ ప్రజలకు సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా జోనల్ డీసీపీలు, ఏసీపీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎన్నో సున్నితమైన ప్రదేశాలు ఉన్నాయని, ఉగాది మరియు రంజాన్ వేడుకల సమయంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక ప్రార్థనల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇప్పటికే అవసరమైన మేరకు రిజర్వు పోలీసులను కూడా పోలీస్ స్టేషన్ విధులకు కేటాయించడం జరిగింది కాబట్టి వారిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని ఆదేశించారు.