సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): డెంగీ వ్యాధి ప్రబలకుండా ప్రజలు పరిశుభ్రత పాటించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్ నగర వాసులకు సూచించారు. శుక్రవారం ముషీరాబాద్ సర్కిల్ గాంధీ నగర్, అరుంధతి కాలనీ, కవాడిగూడ పాఠశాల, ఇందిరాపార్కులను సందర్శించారు.
దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, డెంగీ, మలేరియా వ్యాధికి గురి కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీవాసులకు సూచించారు. కవాడిగూడ పాఠశాలలో విద్యార్థులతో కమిషనర్ మాట్లాడారు. అనంతరం కమిషనర్ ఇందిరాపార్కును సందర్శించారు. అక్కడ వాకర్స్‌తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాకర్స్ సమస్యలను పరిష్కరించాలని యూబీడీ అధికారులను ఆదేశించారు.