సిటీబ్యూరో: అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయవద్దని కమిషనర్ ఇలంబర్తి అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. టౌన్ ప్లానింగ్నకు సంబంధించి అక్రమ నిర్మాణాలపై సర్కిళ్లలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరగడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించడం సరికాదని, ఎవరి పనులు వారు బాధ్యతగా చేయాలన్నారు. అర్జీల స్వీకరణ కాగా, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 57 విన్నపాలు వచ్చాయి.
ఇవి కూడా చావండి
టోల్ ఫ్రీకి.. స్పందన కరువు
సిటీబ్యూరో: కుల గణనలో నమోదు కానీ వారి కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా కాల్ సెంటర్ 040-21111111 ను ఏర్పాటు చేశారు. అయితే గడిచిన రెండు రోజులుగా టోల్ ఫ్రీ నంబరుకు ప్రజల నుంచి స్పందన కరువైంది.
షోకాజ్ నోటీసులు
సిటీబ్యూరో: ఎల్బీనగర్లోని మన్సురాబాద్‌లో కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణ పనుల సెల్లార్ తవ్వకాల సందర్భంగా నిర్మాణదారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టని ఫలితంగా ముగ్గురు కూలీలు దుర్మరణం చెందడం, మరొకరు గాయాల పాలైన ఘటనపై జీహెచ్ఎంసీ యాక్షన్ మొదలు పెట్టింది. ఈ మేరకు టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు సదరు నిర్మాణదారుడికి సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఘటనపై వారం రోజుల్లో వివరణ ఇవ్వకుంటే సదరు నిర్మాణ అనుమతిని రద్దు చేస్తామని అధికారులు నోటీసులో హెచ్చరించారు.
క్లినికల్ చట్టాలపై నేడు అవగాహన సదస్సు
సిటీబ్యూరో: క్లినికల్ చట్టాలు, దవాఖానలు, క్లినిక్‌లలో పాటించాల్సిన నియమాలు తదితర అంశాలపై మంగళవారం సికింద్రాబాద్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈమేరకు అన్ని ప్రైవేటు హాస్పిటల్స్, క్లినిక్ లు, అల్టా్ర సౌండ్ స్కానింగ్‌సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, డెంటల్ క్లినిక్‌లు, ఆయుష్ క్లినిక్‌ల నిర్వాహకులు తప్పనిసరిగా హాజరవ్వాలని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వెంకటి ఆదేశాలు జారీ చేశారు.