మేడ్చల్, జూన్ 8(నమస్తే తెలంగాణ): ఈ నెల 10 నుం చి యధావిధి గా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్ర జావాణి కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు లో ఉండటం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల పక్రియ ముగిసినందున ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందన్నారు.