సిటీబ్యూరో, నవంబర్ 23 ( నమస్తే తెలంగాణ ) : సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 164 ఎస్సీ, ఎస్టీ, బీసీ. మైనార్టీ వసతి గృహాలను రెండు రోజుల్లో తనిఖీ చేసి.. అక్కడి పరిస్థితులపై నివేదిక పంపాలని సూచించారు.
విద్యార్థులతో మాట్లాడి అక్కడి సమస్యలను, సిబ్బంది పనితీరుపై సమగ్ర నివేదిక రూపొందించాలని చెప్పారు. ఇందుకోసం 82 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్టు పేర్కొన్నారు. ఒక్కొక్కరూ రెండు వసతి గృహాలను సందర్శించాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.