సిటీ బ్యూరో : బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని రూ.1200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ పనులు చేపట్టారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం పనులను పరిశీలించారు.
శనివారంలోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురికాకుండా ఉండేందుకు డీజీపీఎస్ సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించి రూ.35 లక్షలతో జీఐ షీట్స్, ఐరన్ పోల్స్ తో ఫెన్సింగ్ వేస్తున్నారు. ఆక్రమణకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, షేక్ పేట తహసీల్దార్ అనిత రెడ్డి, డీఈ సంజీవ్, ఏఈ శ్రీధర్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.