Hyderabad | సిటీబ్యూరో, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): అనుమతి లేకుండా కార్యాలయం నుంచి సమయం కంటే ముందుగానే వెళ్లిపోయిన ఉద్యోగులపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చర్యలు తీసుకున్నారు.
జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న 14 మంది సిబ్బంది శుక్రవారం విధులకు వచ్చి అటెండెన్స్‌లో సంతకం చేసిన వెంటనే వెళ్లిపోయినట్లు తెలిపారు. వారి ఒక రోజు వేతనం నిలుపుదలతో పాటు సర్వీస్‌ను కౌంట్ చేయొద్దని ఆదేశిస్తూ ఎఫ్ఆర్ 18 ప్రకారం, శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.