సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ): గ్రేటర్‌పై చలి తీవ్రత కొనసాగుతుంది. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఫలితంగా రాత్రి, ఉదయం సమయంలో చలి పులి నగర వాసులను వణికిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు 14.0డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 28.6డిగ్రీలు, గాలిలో తేమ 38శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మరో మూడు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.