CM Revanth reddy | కాంగ్రెస్ సర్కార్ పాలనలో భూముల చుట్టూ ఎలాంటి దౌర్జన్యం కొనసాగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ నాయకులు వారి వారి స్థాయిల్లో ఆయా ప్రాంతాల్లోని భూములపై కన్నేసి భూకబ్జాలకు యత్నిస్తున్న ఘటనలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ నేతల పని ఎలా ఉందో స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి.
సర్ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకుడినుద్దేశించి మాట్లాడుతూ.. మరి మా మనోహర్ ఏం చేస్తుండో..? అదొక 10 రోజులు మా మనోహర్ వాయిదా పెట్టాల్సిందే. మా వాళ్లు ఎకరాల లెక్కన కొని గజాల లెక్కన బకరాలకు అమ్ముతుండేమో తెలియదు కానీ.. కొన్ని రోజులు ఆ రియల్ ఎస్టేట్ దందా ఆపేసి SIR ప్రక్రియ పని చూడండి. ఖచ్చితంగా ఆ పనులు వాయిదా పెట్టి బూలు వారీగా జిల్లా మొత్తం తిరగాల్సిందే.. అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడీ కామెంట్స్‌తో స్వయంగా రేవంత్ రెడ్డి తమ నాయకులు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరిచి రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఫోకస్ పెడుతున్నారంటే చెప్పకనే చెబుతున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
మా వాళ్ళు ఎకరాల లెక్కన కొని గజాల లెక్కన బకరాలకు అమ్ముతున్నారు
ఆ రియల్ ఎస్టేట్ కొన్ని రోజులు ఆపేసి SIR ప్రక్రియ పని చూడండి
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/ECQk7E8K65
— Telugu Scribe (@TeluguScribe) July 22, 2026