సిటీబ్యూరో, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు బొల్లోజు రవి, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండా స్వామి రెడ్డి, సభ్యుల బృందం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
జర్నలిస్టుల సొంతింటి కలను సీఎం రేవంత్ రెడ్డి సాకారం చేస్తారనే విశ్వాసాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చించాలని హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు సూచించారు. అనంతరం జర్నలిస్టులకు ఎలా ఇళ్ల స్థలాలు కేటాయించాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.