వనస్థలిపురం : ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. వనస్థలిపురం ప్రశాంత్ నగర్‌కు చెందిన నాగరాణి బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స నిమిత్తం దవఖానలో చేరింది.
వైద్యానికి ఆర్థిక స్థోమత సరిపోకపోవడంతో ఎమ్మెల్యే సహకారంతో సీఎం సహాయనిధికి దరకాస్తు చేసుకుంది. ఆమెకు రూ.3లక్షలు మంజూరయ్యాయి. ఆ చెక్కును సోమవారం బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు.
ఆరోగ్యం పట్ల ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో అనంతుల రాజిరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, సతీష్‌యాదవ్, శ్రీనివాస్, ఆనంద్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.