విగ్రహావిష్కరణ.. ట్రాఫిక్ ఆంక్షలు
నెక్లెస్ రోటరీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.
- ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ పరిధిలో
- లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్డు మూసివేత
- నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నెక్లెస్ రోటరీ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశాలున్నాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. అలాగే నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ రూట్లలోకి వచ్చే ట్రాఫిక్‌ను ఆయా కూడళ్లలో ఇతర మార్గాలకు మళ్లించడంతో పాటు ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కులు మూసి ఉంటాయని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1నుంచి రాత్రి 8గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ట్యాంక్‌బండ్‌పై నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా..
- ఖైరదాబాద్ చౌరస్తాలోని పీవీ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు వచ్చిపోయే వాహనాలకు అనుమతి లేదు.
- ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ వైపు నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను ఖైరతాబాద్ చౌరస్తా నుంచి సాదన్, నిరంకారి వైపు వెళ్లాలి.
- ట్యాంక్‌బండ్ నుంచి పీవీఎన్ఆర్ మార్గ్‌కు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను సోనబి మాస్క్ నుంచి రాణిగంజ్, కార్బాల వైపు మళ్లిస్తారు.
- రసూల్‌పురా, మినిస్టర్ రోడ్డు నుంచి నెక్లెస్ రోటరీకి నల్లగుట్ట నుంచి వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలు నల్లగుట్ట జంక్షన్ నుంచి రాణిగంజ్ వైపునకు వెళ్లాలి.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్‌బండ్, రాణిగంజ్, లిబర్టీ వైపు వాహనాలకు అనుమతి లేదు. తెలుగుతల్లి ైప్లెఓవర్ నుంచి కట్టమైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్లాలి.
- ట్యాంక్‌బండ్ నుంచి తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను అనుమతి లేదు. ఈ వాహనాలను ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వెళ్లాలి.
- బీర్కేఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే వాహనాలు తెలుగు తల్లి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వెళ్లాలి.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి మింట్‌కంపౌండ్ లేన్‌లోకి వాహనాల అనుమతి లేదు.
- ఖైరతాబాద్ బడా గణేశ్ లేన్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వైపు అనుమతి లేదు. ఈ వాహనాలు రాజ్‌దూత్ లేన్ నుంచి వెళ్లాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

