సికింద్రాబాద్, అక్టోబర్ 16 : సికింద్రాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావుకు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్‌తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరితో మమేకమవుతూ మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగాలని అభ్యర్థి పద్మారావుకు సూచించారు. తనపై నమ్మకం ఉంచి ఈసారి కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి, బీఫాం అందజేసిన సీఎం కేసీఆర్‌కు పద్మారావు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో సబ్బండ వర్గాలకు ఉపయోగపడేలా ఉన్నదని, మ్యానిఫెస్టోతో ఇతర పార్టీల నేతల్లో కలవరం మొదలైందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల నుంచి మ్యానిఫెస్టోపై సానుకూల స్పందన వస్తున్నదని సీఎంకు తెలిపారు. మొదటి రోజు సికింద్రాబాద్ పార్శిగుట్టలో ప్రచారం నిర్వహించిన అనంతరం పద్మారావు తన తనయులు రామేశ్వర్‌గౌడ్, తినేత్రగౌడ్లతో కలిసి తెలంగాణ భవన్‌కు వెళ్లి బీ ఫామ్ అందుకున్నారు. సికింద్రాబాద్ నుంచి భారీ మెజార్టీతో గెలిచి వస్తాననని సీఎంకు హామీ ఇచ్చారు.
భారీ మెజార్టీతో గెలిచి రావాలి
కుత్బుల్లాపూర్ అభ్యర్థి వివేకానంద్‌కు బీ ఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 16 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేపీ వివేకానంద్‌కు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్‌తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిచి రావాలని ఆశీర్వదించారు. తనపై నమ్మకం ఉంచి ఈసారి కూడా ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించి, బీఫాం అందజేసిన సీఎంకు వివేకానంద్ కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 140 రోజులుగా బస్తీలలో చేపడుతున్న ప్రగతి యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, ఈసారి భారీ మెజార్టీతో గెలిచి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. వివేకానంద్‌తో పాటు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విఫ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా ఉన్నారు.
లక్షకు పైగా మెజార్టీ సాధించాలి
మేడ్చల్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి బీ ఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
మేడ్చల్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చామకూర మల్లారెడ్డికి సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్‌తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. మేడ్చల్‌లో మంచి పేరు సంపాదించుకున్నారని, లక్షకు పైగా మెజార్టీ సాధించాలని సీఎం కేసీఆర్ సూచించారు. బీఫాం తీసుకున్న సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో లక్షకు పైగా మెజార్టీ సాధించి సీఎం కేసీఆర్‌కు రుణం తీర్చుకుంటానని ధీమా వ్యక్తం చేశారు.
విజయంతో తిరిగిరావాలి..
కంటోన్మెంట్ అభ్యర్థి లాస్యనందితకు బీ ఫామ్ అందజేసి ఆశీర్వదించిన సీఎం కేసీఆర్
కంటోన్మెంట్, అక్టోబర్ 16 : బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితకు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ బీ-ఫామ్‌తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ లాస్యనందితకు పలు సూచనలు చేశారు. బీ-ఫామ్ నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నిత్యం ప్రజల్లోనే ఉండాలని, ప్రతి చిన్న కార్యకర్తతో మాట్లాడే ప్రయత్నం చేయాలని, విజయంతో తిరిగిరావాలని ఆశీర్వదించారు. బీ-ఫామ్ తీసుకునే సమయంలో లాస్యనందిత తల్లి గీతమ్మతో పాటు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్, జీహెచ్ఎంసీ కో-ఆప్షన్ మాజీ సభ్యులు నర్సింహ ముదిరాజ్ ఉన్నారు.
నాల్గవ సారి లక్ష మెజార్టీతో గెలువాలి
రాజేంద్రనగర్ అభ్యర్థి ప్రకాశ్‌గౌడ్‌కు బీ ఫామ్ అందజేసి ఆశీర్వదించిన సీఎం కేసీఆర్
మణికొండ, అక్టోబర్ 16 : రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి టి.ప్రకాశ్‌గౌడ్‌కు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్‌తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. ఇప్పటికే మూడు సార్లు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొంది రికార్డు సృష్టించడం గొప్ప విషయమన్నారు. 4వసారి లక్ష మెజార్టీతో అఖండ విజయం సాధించాలని సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి సైనికులుగా పని చేయాలని, తొమ్మిదేండ్లలో చేపట్టిన అభివృద్ధి, రానున్న రోజుల్లో చేపట్టబోయే అభివృద్ధిని ప్రతి గడపకు వెళ్లి వివరించి ఓట్లు అడుగుతామని తెలిపారు. భారీ మెజార్టీతో గెలిచి వస్తానని సీఎం కేసీఆర్‌కు మాటిచ్చారు.
సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి
అంబర్‌పేట అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌కు బీ ఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
అంబర్‌పేట, అక్టోబర్ 16 : అంబర్‌పేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌కు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్‌తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. గత తొమ్మిదేండ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలిచి రావాలని సీఎం కేసీఆర్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్‌కు సూచించారు. తనపై నమ్మకంతో మరోసారి టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతానన్నారు. ఎన్నికల్లో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
మ్యానిఫెస్టోను వివరించండి
ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు బీ ఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
ముషీరాబాద్, అక్టోబర్ 16 : ముషీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్‌కు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్‌తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను గడపగడపకు వివరించాలని సీఎం కేసీఆర్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు సూచించారు. మరో అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారీ మెజార్టీతో గెలిచి వస్తానని అన్నారు.
మెజార్టీపై దృష్టి సారించాలి
ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్‌కు బీ ఫామ్ అందజేసిన సీఎం కేసీఆర్
బంజారాహిల్స్,అక్టోబర్ 16 : ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దానం నాగేందర్‌కు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ బీ -ఫామ్‌తో పాటు రూ.40 లక్షల విలువ గల చెక్కును అందజేశారు. అన్నివర్గాలకు కలుపుకొని ప్రచారం నిర్వహించాలని, గెలుపు ఖాయం, మెజార్టీపై దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ ఖైరతాబాద్‌లో మరోసారి భారీ మెజార్టీతో గెలువడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.