హైదరాబాద్ : ఇటీవలే రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మంత్రి ఆశీర్వాదం తీసుకున్నారు. బాలరాజుకు మంచి భవిష్యత్ ఉంటుందని, సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.