మల్కాజిగిరిలో క్లస్టర్ పోలీసింగ్
నేరాల కట్టడికి మల్కాజిగిరి పోలీసులు క్లస్టర్ విధానంతో మరింత క్షేత్ర స్థాయి పోలీసింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే మీ సురక్ష పేరుతో డేటాను సేకరిస్తున్నా రు. దీనికితోడు క్లస్టర్లలో మరిన్ని భద్రత చర్య లు తీసుకుంటున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో కొన్ని సెక్టార్లు ఉంటాయి, ఆ సెక్టార్లలో ఎంపిక చేసిన బస్తీ, కాలనీ, ప్రధాన కూ డలిని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, అక్కడ మ రింత ఫోకస్ పెడుతున్నారు.
- నేరాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ అమలు
- సెక్టార్ల కంటే మరింత క్షేత్ర స్థాయిలోకి పోలీసింగ్
సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): నేరాల కట్టడికి మల్కాజిగిరి పోలీసులు క్లస్టర్ విధానంతో మరింత క్షేత్ర స్థాయి పోలీసింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే మీ సురక్ష పేరుతో డేటాను సేకరిస్తున్నా రు. దీనికితోడు క్లస్టర్లలో మరిన్ని భద్రత చర్య లు తీసుకుంటున్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో కొన్ని సెక్టార్లు ఉంటాయి, ఆ సెక్టార్లలో ఎంపిక చేసిన బస్తీ, కాలనీ, ప్రధాన కూ డలిని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, అక్కడ మ రింత ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్ల పరిధిలో క్లస ్టర్లు ఏర్పాటయ్యాయి. క్లస్టర్లతో క్షేత్రస్థాయిలో పోలీసింగ్ విధులు నిర్వహించే అవకాశముంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
నేరాల కట్టడికి..
నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై పోలీసులు ప్రధాన దృష్టి సారిస్తున్నారు. ఆ ప్రాంతాలలో ఉండే వారి వివరాలు స్థానిక పోలీస్స్టేషన్లలో పక్కాగా ఉండే విధంగా వ్యవస్థను తయారు చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా సుమతి బాధ్యతలు చేపట్టిన తరువాత దిల్సుఖ్నగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఒంటరిగా పర్యటించి అక్కడి పరిస్థితులను వెలుగులోకి తెచ్చారు. అనంతరం దిల్సుఖ్నగర్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ హాస్టల్స్ యాజమాన్యాలు, విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హాస్టల్స్ డేటాను పక్కాగా సేకరించి ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్స్టేషన్లలో ఇవ్వాలని సూచనలు చేశారు. అలాగే నేపాలీ గ్యాంగ్‌లు ఇండ్లలో పని కోసం చేరి.. అవకాశం చిక్కగానే ఆ ఇంటి యజమానులను నిర్బంధించి, పరిస్థితులను బట్టి హత్యలకు కూడా వెనుకాడకుండా దోపిడీలకు పాల్పడిన ఘటనలు ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరిగాయి.
అలాగే ఇండ్లలో పనిచేసేందుకు కొత్తవారిని నియమించుకోవడంతో అప్పుడప్పుడు అక్కడక్కడ వివిధ రకాల నేరాలు సైతం జరుగుతుండడంతో ఇండ్లలో పనిచేసే కార్మికుల వివరాలు పక్కాగా ఉండాలని, మీ సురక్ష యాప్‌తో వారి బ్యాంక్ గ్రౌండ్ చెకింగ్ చేస్తున్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లల భద్రతపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు. ఉప్పల్ భాగయాత్లో కస్టర్‌ను ఏర్పాటు చేసి ఆ ప్రాం తంపై ఫోకస్ పెట్టారు, ఆ ప్రాంతానికి వచ్చిపోయే వారి వివరాలు, పకడ్బంధీగా సీసీ కెమెరాల ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి పోలీసింగ్‌ను బలోపేతం చేశారు. ఇలా ఆయా పోలీస్స్టేషన్లలో కస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు.
విజిబుల్ పోలీసింగ్‌తో..
నేరాల కట్టడికి క్షేత్రస్థాయి పోలీసింగ్‌ను పటిష్టం చేస్తూ విజిబుల్ పోలీసింగ్‌పై దృష్టి పెట్టారు. పెట్రోలింగ్ వ్యవస్థ నిరంతరం అప్రమత్తంగా ఉండడంతోనే నేరాలు కట్టడి చేస్తారని, పెట్రోలింగ్ వ్యవస్థపై పర్యవేక్షణ చేపట్టారు. వివిధ రకాల నేరాలను అదుపు చేయడానికి క్లస్టర్‌తో మరింత మెరుగైన పోలీసింగ్ చేయవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అటూ టెక్నాలజీ, విజిబుల్ పోలీసింగ్, అనుమానితుల డేటాను సేకరిస్తూ నేరాలను కట్టడి చేయడంపై మల్కాజిగిరి పోలీసులు ప్రత్యేక కార్యచరణ చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

