ఖైరతాబాద్, ఫిబ్రవరి 13 : తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించిందామే. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి వస్రాం తండాకు చెందిన గుగులోతు జయమ్మ (58) గృహిణి. ఆమెకు భర్త మాన్సింగ్, గణేశ్, నరేశ్ సంతానం. ఈ నెల 10న భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను సోమాజిగూడలోని యశోద దవాఖానలో చేర్పించారు.
చికిత్స అందిస్తున్న వైద్యులు ఈ నెల 12న బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు. కుటుంబ సభ్యులను కలిసిన జీవన్‌దాన్ ప్రతినిధులు అవయవదానం విశిష్టతను వివరించగా, అంగీకరించారు. కాలేయం, రెండు కండ్లు, ఒక మూత్రపిండం, ఊపిరితిత్తిని సేకరించారు. అవయవదానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను జీవన్‌దాన్ అభినందించింది.