ఒంటి కాలుతో శిఖరం చేరి

- ఒంటి కాలుతో పర్వతారోహణ
- ఆత్మవిశ్వాసం ముందు తలవంచిన వైకల్యం
- 15 ఏండ్లుగా ైక్లెంబింగ్, సైక్లింగ్, మారథాన్
- అనేక రికార్డులు, అవార్డులు సొంతం
- లడక్‌లోని ఖంగ్రి పర్వతారోహణకు సన్నాహాలు
- కాలు మార్చుకోవడానికి దాతల కోసం ఎదురుచూపు
సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : అంగవైకల్యం లక్ష్యసాధన ముందు తలవంచింది. ఆయన సాహసం శిఖరాన్ని ఎక్కేలా చేసింది. ఎడమకాలు లేకున్నా వెనుకడుగు వేయకుండా,కుంగిపోకుండా మంచుగడ్డల్లో ముందుకు సాగుతున్నాడు. అతడి పేరు శేఖర్. ఫార్మా ఉద్యోగి. సాఫీగా సాగుతున్న అతడి జీవితంలో విద్యుత్ ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది. ఎడమ కాలు కోల్పోయాడు. ఎన్నో ఆశలతో నిండుకున్న జీవితం ఒక్కసారిగా తలకిందులయ్యింది. ‘ఒంటి కాలితో ఏం చేస్తాం? జీవితం ముగిసినట్టేనా? ఇక బతకను? అంటూ వెక్కివెక్కి ఏడ్చిన ఆ క్షణాలు అతడిని వెంటాడాయి. 2006లో విద్యుత్ ప్రమాదం జరగగా, 15 ఏండ్లు అయినా వెనుకడుగు వేయలేదు. ఒంటి కాలితో ఏం చేయగలవు? అన్న నోళ్లను అనేక పర్వతాలను ఎక్కి రికార్డులతో మూయించాడు.
కృత్రిమ కాలుతోనే..
జైపూర్ కాలును అమర్చుకొని ఒంటి కాలితో పర్వతాలను ైక్లెంబింగ్ చేస్తూ సత్తా చాటుతున్నాడు శేఖర్. ఒంటి కాలితో పర్వతాలను అధిరోహిస్తూ అనేకమందికి జీవితంపై ఆశలు కల్పిస్తున్న మౌంటెనియర్ శేఖర్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో చేర్చడానికి సిద్ధమయ్యాడు. జమ్ముకశ్మీర్ లడక్‌లోని ఖంగ్రి పర్వతాన్ని (6070 మీటర్లు) అధిరోహించడానికి పూనుకున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో ఈ యాత్ర సాగనుంది. అందుకు ఓ ఆర్టిఫిషియల్ కాలు అవసరం పడగా, నిధుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. దాతలు ముందుకొచ్చి పెద్ద మనసుతో సాయమందిస్తే లక్ష్యాన్ని పూర్తి చేస్తానని కోరుతున్నాడు.
ఇవీ రికార్డులు
- 2014 ఎయిర్టెల్ మారథాన్ పూర్తి చేశాడు.
- 200 కి.మీ. సైక్లింగ్ చేశాడు.
- 10కి.మీ. పరుగుపందెంలో పాల్గొన్నాడు.
- లడక్ టు కన్యాకుమారి సోలో సైక్లింగ్‌ను 48 రోజుల్లో 4100 కిలోమీటర్లు.
- 2018లో ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌ను అధిరోహించాడు.
- యూరప్‌లో అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం మౌంట్ ఎల్బ్రస్ను 2019లో అధిరోహించాడు.
- 2019లో ఆఫ్రికాలో అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్ కిలిమంజారోను అధిరోహించాడు.
- ఆస్ట్రేలియాలో మౌంట్ కోస్కియూస్కోను 2020లో అధిరోహించాడు.
సాయం చేయండి ప్లీజ్
పర్వతాలను అధిరోహించాలనేది చిన్నప్పటి నుంచి ఆశ. విద్యుత్ ప్రమాదంలో కాలు కోల్పోయాక జీవితం ముగిసిందని బాధపడ్డాను. స్నేహితులు, కుటుంబమిచ్చిన ధైర్యం ఇంకా నడిపిస్తుంది. ఇప్పటికే అనేక దేశాల్లోని పర్వతాలను అధిరోహించాను. ఇప్పుడు లడఖ్‌లోని మరో ఎత్తయిన ఖంగ్రి పర్వతాన్ని ైక్లెంబింగ్ చేయాలనుకుంటున్నా. కృత్రిమ కాలు అవసరం పడింది. దాతలు సాయం చేస్తే కల నిజం చేస్తా.
-శేఖర్, పర్వతారోహకుడు
దక్కిన అవార్డులు
హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
2017లో భారతప్రతిభ పురస్కారం పొందాడు.
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

