గొంతెత్తిన ఆటోవాలాలు
ఆటో డ్రైవర్లు ‘సీఎం డౌన్ డౌన్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు.. ఆటో డ్రైవర్లతో చర్చించి సముదాయించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు 5 లక్షల బీమా, ప్రతి ఏటా 12 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
- వందలాది ఆటోలతో ఎంజే మార్కెట్ చౌరస్తా దిగ్బంధం
- న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ‘చక్కా జామ్’
- ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..అడ్డుకున్న నగర పోలీసులు
- 2 గంటల పాటు నిలిచిన ట్రాఫిక్
ఆటో డ్రైవర్లు ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు.. ఆటో డ్రైవర్లతో చర్చించి సముదాయించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు 5 లక్షల బీమా, ప్రతి ఏటా 12 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
సుల్తాన్‌బజార్/జియాగూడ, ఏప్రిల్ 25: ఇన్ఫార్మల్ లేబర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్లు ‘చక్కా జామ్’ పేరిట ధర్నా చేపట్టారు. రెండు గంటల పాటు రోడ్డుపై ఆటోలు నిలిపి చౌరస్తాను దిగ్బంధించారు. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు పోరాడుతామని నినదించారు. అనేక సార్లు ప్రభుత్వానికి విజప్తి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఓ ఆటో డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఒక్కసారిగా డ్రైవర్ల ఆందోళన రణరంగంగా మారింది. పోలీసులు అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎంజే మార్కెట్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.
సుమారు వంద ఆటోలతో ఎంజే మార్కెట్ చౌరస్తాను దిగ్భందం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. రెండు గంటల పాటు చౌరస్తాలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆటో డ్రైవర్లు ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు.. ఆటో డ్రైవర్లతో చర్చించి సముదాయించడంతో వారు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆటోడ్రైవర్లకు 5 లక్షల బీమా, ప్రతి ఏటా 12 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఇతర జిల్లాల రిజిస్ట్రేషన్‌తో నడుస్తున్న ఆటోలను నిలిపివేయాలన్నారు. ఎల్లో ప్లేట్ కాని వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా ఆపరేట్ చేస్తున్న ఓలా, ఉబర్, రాపిడో వంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలని, 15 ఏండ్లుగా ఆటో మీటర్ చార్జీలను పెంచలేదని, తక్షణమే పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ బంధు అసోసియేషన్ చైర్మన్ బాక్రి మాట్లాడుతూ 14 సంవత్సరాలుగా ఆటోమీటర్ రేట్ కార్డు పెంచడం లేదని, దీంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ఆటోలను నగరంలో తిరగనీయవద్దని ప్రభుత్వానికి పోలీస్ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

