ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్సై
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు నిర్వహిస్తుంటారు. అందులో నకిలీ పాస్‌పోర్టులతో పాటు అక్రమంగా డ్రగ్స్, బంగారం, వివిధ వస్తువులను తరలిస్తుంటారు. వారితో జతకడితే రూ.కోట్లు సంపాదించవచ్చు అనుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్టు పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్సై యూకే సిద్దేశ్వర్, సీఐ సంపతి కనకయ్య ఇద్దరిని ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
- నకిలీ పాస్‌పోర్టు కేసులో రూ.15లక్షలు డిమాండ్
శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 8 : శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు నిర్వహిస్తుంటారు. అందులో నకిలీ పాస్‌పోర్టులతో పాటు అక్రమంగా డ్రగ్స్, బంగారం, వివిధ వస్తువులను తరలిస్తుంటారు. వారితో జతకడితే రూ.కోట్లు సంపాదించవచ్చు అనుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్టు పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్సై యూకే సిద్దేశ్వర్, సీఐ సంపతి కనకయ్య ఇద్దరిని ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. ఏసీడీ రంగారెడ్డి రేజ్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నకిలీ పాస్‌పోర్టు కేసులో నిందితుడిగా ఉన్న కేరళ రాష్ర్టానికి చెందిన ఓ వ్యక్తి అతడు చదువుకున్న సర్టిఫికెట్ల కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈ కేసులో ప్రతి అదివారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని అవుట్‌పోస్టు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి హాజరు ఇచ్చి పోతుంటాడు. అయితే అతడి ఛార్జీషీట్ దాఖలు చేయడంలో అలస్యం చేయడంతో పాటు అతడి కుటుంబ సభ్యులను కేసులో ఇరికించకుండా ఉండడం కోసం నిందితుడిని భయపెట్టి రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగైతే అంతా తామే చూసుకుంటామని చెప్పారు. నిందితుడు అన్ని డబ్బులు ఇవ్వలేనని రూ.5లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. మొదటగా రూ.2 లక్షలు ఇస్తానని ఒప్పుకున్న నిందితుడు…. పోలీసులు డబ్బుల కోసం పెడుతున్న ఇబ్బందులను భరించలేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
మంగళవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని అవుట్‌పోస్టు పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై సిద్దేశ్వర్ ఆదేశాల మేరకు నిందితుడు రూ.2లక్షలు ఎస్సై యూకే సిద్దేశ్వర్, సీఐ సంపతి కనకయ్యలకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. సీఐ కనకయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేయగా రూ.33,97,000 ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీంతో పాటు కొన్ని ఆస్త్తి పత్రాలు అభ్యమైనట్లు చెప్పారు. నింధితులను ఏసీబీ కోర్టు హాజరుపర్చినట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

