ఉప్పల్, మార్చి 29: హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి దేవాలయం గాయత్రి మాత, ఉప ఆలయముల పునర్నిర్మాణ పనుల్లో భాగంగా స్లాబ్ పనులు ఆలయ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు దాసరి కృష్ణ మాట్లాడుతూ అత్యంత పురాతనమైన దేవాలయం చిల్కానగర్ లోని ప్రధాన ఆలయం శివాలయం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణం పనులు ఆలయకమిటీ ఆధ్వర్యంలో వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉప్పల్ (Uppal) ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్లాబ్‌కు అవసరమైన కాంక్రీట్ అందించారని, చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ స్లాబ్ కు అవసరమైన స్టీల్ ఇచ్చారని, అలాగే ఆలయ నిర్మాణం కోసం ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారని తెలిపారు. వారి అందరికీ ఆలయకమిటీ తరుపున మరియు చిల్కానగర్ గ్రామ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నామనీ చెప్పారు.
ఇప్పటివరకు ఒక కోటి రూపాయల వ్యయంతో మొదటి అంతస్తు స్లాబ్ పనులు పూర్తి చేశామని, ముఖ్యమైన ఘట్టం రాతి కట్టడంతో ఆలయముల నిర్మాణం జరుగనున్నద ని పేర్కొన్నారు . ఆలయ నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో చిల్కానగర్ లోని ప్రతి గడపకు ఆలయకమిటీ సభ్యులు వస్తారని, అందరూ పెద్ద మనసుతో విరాళం అందించి గుడి పున్నరునిర్మాణంలో బాగ స్వాములు కావాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షులు దాసరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి గోనె శ్రీకాంత్, ఆలయ కమిటీ సీనియర్ సభ్యులు గ్రామ పెద్దలు శుంభు ప్రసాద్, బూరుగుల రమేష్ గౌడ్, గోనె అంజయ్య, అమృత్ రావు, ఆడెపు అంజయ్య, జెల్లి మెహన్, దేవసాని బాలచందర్, సిద్ధిరాజు, పి.గౌరయ్య , అంబటి జగదీష్, మొట్టే రమేష్, ఆర్.బలరాం, పాల్వంచ విఠల్ ,దాసరి శ్రీనివాస్, ముక్కల రామకృష్ణ, గోపాల్ రెడ్డి, కొంపల్లి రవీందర్, ఎస్.చంద్రయ్య, కొంపల్లి బాలరాజు, బి.కృష్ణ, కావాలి నర్సింహ్మ, వీరారెడ్డి, ఎన్.రాంచందర్, స్వామి యాదవ్, ఈ. రవీందర్ రెడ్డి, పున్నం రాజు, మధుసూదన్ రెడ్డి, పిట్లల నరేష్, అంజి గౌడ్, పల్లె నర్సింగ్ రావు, పారుపాటి రాంరెడ్డి, విద్యసాగర్, పిట్లల శ్రీరాములు, పైడిపాల సాయిలు, దండు అంజయ్య, వాసు, ఉమేష్ సింగ్, ఎస్. ప్రసాద్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ చారి, కొంపల్లి రాజు, మల్లేష్, బొల్లం లక్ష్మణ్, గుర్రాల మల్లేష్, కృష్ణ ముదిరాజ్, మడిపడిగే శ్రీనివాస్, పెరుమాళ్ శివ, సునీల్ నాయక్, యం. శ్రీనివాస్ పాల్గొన్నారు.