చిక్కడపల్లి, జూన్ 18: గోల్కొండ చౌరస్తా సమీపంలో ఉన్న చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని నారాయణగూడ మెట్రో పిల్లర్ 1177 , నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న పోలీస్ క్వార్టర్స్‌కు మార్చారు. ఇప్పటివరకు గోల్కొండ చౌరస్తాలో ఉన్న చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలోకి కొత్తగా ఏర్పాటైన గాంధీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కార్యాలయంగా మార్చారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు చిక్కడపల్లి లా అండ్ ఆర్డర్ ఏసీపీ పరిధిలో వచ్చే చిక్కడపల్లి, ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ ప్రాంతాలకు చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిగా నిర్ధారించారు.
అలాగే గాంధీనగర్ లా అండ్ ఆర్డర్ ఏసీపీ డివిజన్ పరిధిలోకి వచ్చే గాంధీనగర్ , దోమలగూడ పోలీస్ స్టేషన్ల ప్రాంతాలకు గాంధీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిగా నిర్ధారించారు. మార్పుల్లో భాగంగా నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ స్థానంలో కొత్తగా గాంధీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు జరిగింది. గత నెల రోజుల కిందట నగర కమిషనర్ ఆదేశాల ప్రకారం ఈ మార్పులు జరగాయని అధికారులు వివరించారు.