ఎల్బీనగర్ జోన్‌బృందం, అక్టోబర్ 15: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. జై తెలంగాణ.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటనతోనే పార్టీ విజయం ఖాయమైందని.. ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యిందని కొత్తపేట మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి తెలిపారు. కొత్తపేట డివిజన్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మోహన్‌నగర్ చౌరస్తాలో సంబురాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ అమోదయోగ్యమైన మేనిఫెస్టోను ప్రజల ముందుకు సీఎం కేసీఆర్ తెచ్చారన్నారు. పేదల ప్రజల పార్టీ బీఆర్ఎస్ అని తేలిందని, రాబోయే ఎన్నికల్లో ఎల్బీనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఘన విజయం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాగిరి ఉదయ్ గౌడ్, జహీర్‌ఖాన్, బొగ్గారపు వరుణ్‌చంద్ర, ఇటిక్యాల యాదగిరి, తాళ్ల శ్రీశైలం గౌడ్, ఆర్. కన్నయ్య ముదిరాజ్, జోగు కృష్ణ, జోగు నాగేశ్, నిఖిల్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటన తెలంగాణలో హ్యాట్రిక్ విజయానికి సంకేతమని గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవానీప్రవీణ్కుమార్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్‌లు హర్షం వ్యక్తం చేశారు. గడ్డిఅన్నారం డివిజన్ పీఅండ్‌టీ కాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీశైలం యాదవ్, రమేశ్ ముదిరాజ్, వూర నర్సింహ గుప్తా, బాలా గౌడ్, సన్నీ యాదవ్, రవీంద్రారెడ్డి, బుచ్చయ్య చౌదరి, నర్సింహ, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవస్థానం డైరెక్టర్ శైలజ, విజయలక్ష్మి, పరమేశ్వరి, అరుందతి, ఉమా, హసినా, నిరంజన్‌బీ, వరలక్ష్మి, స్వప్న తదితరులు
కేసీఆర్ విజన్ బీఆర్ఎస్ విజయానికి మార్గాలు వేస్తుందని కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయం పాలకవర్గం చైర్మన్ నల్ల రఘుమారెడ్డి అన్నారు. కర్మన్‌ఘాట్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటాకిని క్షీరాభిషేకం చేసి బీఆర్ఎస్ నాయకులు సంబురాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవి ముదిరాజ్, రాజిరెడ్డి, రోజారెడ్డి, అంజిరెడ్డి, తిరుమలేశ్, సురేందర్‌రెడ్డి, సామ సురేందర్‌రెడ్డి, సత్యప్రకాశ్, ఉమామహేశ్వర్, జంగయ్య, ప్రభాకర్, మల్లేశ్ గౌడ్, శేఖర్‌రెడ్డి, గోపాల్, యాదిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ఉందని మన్సూరాబాద్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి తెలిపారు. హయత్‌నగర్ పరిధి వీరన్నగుట్లకాలనీలో బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్‌యాదవ్, నాయకులు ఏలుకొండ రాంకోటి, ప్రవీణ్‌రెడ్డి, పారంద నర్సింగ్‌రావు, కేకేఎల్ గౌడ్, వెంకట్రావు, తిరుమలకృష్ణ, నర్సింహ యాదవ్, సత్తయ్య, భాస్కర్, మధు, లష్కర్ కృష్ణ, శ్రీనివాస్, కరుణ, నవనీత, మాధవి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ నాగోల్ డివిజన్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి ఆధ్వర్యంలో నాగోల్ చౌరస్తాలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో కట్ట ఈశ్వరయ్య, పల్లె సీతారాములు, డప్పు వినోద్, కాటెపాక రవి, రంగేశ్వరి, శ్యాంసుందర్, బద్దం శ్రీధర్, డప్పు వెంకటేశ్, ఎం.వెంకటేశ్ పాల్గొన్నారు.
హయత్‌నగర్‌లో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్ ఆధ్వర్యంలో జయచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ దేవిరెడ్డి కమలాసుధీర్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, పార్టీ శ్రేణులు, మహిళలతో కలిసి పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, డ్యాగల రాకేశ్ కుమార్, తొండ వెంకటేశ్, పానుగోతు స్వామినాయక్, నాగరాజు, కుషనపల్లి వీరన్న, రాఘవేంద్రగౌడ్, రవినాయక్, దేవరాజు తిరుపతి, మందప్రశాంత్, నరేశ్ గౌడ్, వెంకటేశ్, మహిళా విభాగం సెక్రటరీ పుష్ప, అలివేలు, జ్యోతి, అన్నపూర్ణ శివ, మంద శ్రీకాంత్, అంజమ్మ, రాజు, తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నాపెద్ద కొడుకు..
హయత్‌నగర్, అక్టోబర్ 15: నాకు ప్రతినెలా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్న నాపెద్ద కొడుకు సీఎం కేసీఆర్. నాకు కంటి చూపు కానరాకుంటే కంటివెలుగు కార్యక్రమంతో వైద్యపరీక్షలు నిర్వహించి కంటి అద్దాలు అందజేసిండు కేసీఆర్. నేను బతికున్నంత కాలం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా. ముససోల్లంతా ఒక్కటై కారు గుర్తుకు ఓటేసి గులాబీ(బీఆర్ఎస్) పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి. నాపెద్ద కొడుకు కేసీఆర్‌ను మూడోసారి సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి.
– పాపకంటి లక్ష్మమ్మ, హయత్‌నగర్.