సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
ఈ ఆవర్తనం మరింత బలపడే అవకాశముండడంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 32.4, కనిష్ఠం 24.0, గాలిలో తేమ 64శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.