Vanga Madhusudhan Reddy : చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగా మధుసూధన్ రెడ్డి (Vanga Madhusudhan Reddy) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. మధుసూదన్ రెడ్డి మృతిపట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం తెలిపారు. ఒక మంచి నాయకుడిని కోల్పోయామని బండి అన్నారు. ఆదివారం కర్మాన్ఘాట్లోని నివాసంలో మధుసూదన్ రెడ్డి పార్థీవ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతామని బీజేపీ రంగారెడ్డి నాయకులు తెలిపారు.
విషాదకర ప్రకటన
నా మిత్రుడు, చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి గారు పరమపదించారని తెలియజేయుటకు ఎంతో చింతిస్తున్నాము.
రేపు కర్మాన్ఘాట్ గ్రామంలో వారి నివాసం వద్ద పార్థివ దేహం దర్శనార్థం ఉంచబడుతుంది.#omshanti pic.twitter.com/RQ9obMwft2— BJP Ranga Reddy District Urban (@BJPRangaReddyTS) January 24, 2026