వెంగళరావునగర్, ఆగస్టు 18 : వ్యాపారి మెడలోని బంగారు చైన్‌ను(Chain snatching) తెంపడానికి దొంగలు విఫలయత్నం చేశారు. దొంగలతో ప్రతిఘటించి పోరాడారు ఆ వ్యాపారి. పెనుగులాటలో కిందపడ్డ వ్యాపారి వద్ద నున్న సెల్ ఫోన్ లాక్కుని దొంగలు ఉడాయించారు. పోలీసులు తెలిపిన వివారలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్ నగర్‌కు చెందిన బోయ ఆంజనేయలు(35) కొబ్బరికాయల హోల్ సేల్ వ్యాపారి. రాత్రి ఒంటి గంట సమయంలో రహ్మత్ నగర్ నుంచి ఎల్లారెడ్డిగూడకు ఆంజనేయులు బయలుదేరారు.
యూసుఫ్‌గూడ(Yusufguda) జానకమ్మ తోట వద్దకు వచ్చేసరికి ఇద్దరు ఆగంతకులు వచ్చి అతని మెడలోని బంగారు చైన్‌ను లాక్కోడానికి ప్రయత్నించారు. ఆ ఇద్దరు దొంగల్ని ధైర్యంగా ఎదిరించి పోరాడారు .ఆ పెనుగులాటలో అతని చైన్ కిందపడింది. చైన్ దొంగలపాలవకుండా దక్కించుకున్నారు. ఆంజనేయులు వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కుని దొంగలు ఉడాయించారు. దొంగల దాడిలో గాయపడ్డ బాధితుడ్ని దవాఖానాకు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.