హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్లో దొంగలు కలకలం సృష్టించారు. ఇంట్లో నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కెళ్లారు.
ఎండ వేడిమి, ఇంట్లో ఉక్కపోత కారణంగా అబ్దుల్లాపూర్మెట్లోని ఓ ఫ్యామిలీ బుధవారం రాత్రి ఇంటి డోర్ తెరిచి పడుకుంది. ఇది గమనించిన దుండుగులు మహిళ మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడును అపహరించుకుని వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.