హైదరాబాద్ : నగరంలోని ఎర్రగడ్డలో పట్టపగలే చైన్ స్నాచింగ్ జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఓ యువకుడు బంగారు గొలుసును తెంచాడు. ఆ గొలుసు లాక్కొని బైక్‌పై పరారవుతుండగా యువకుడు కిందపడిపోయాడు.
మహిళ అరుపులతో అప్రమత్తమైన స్థానికులు.. బైక్ నుంచి కిందపడ్డ చైన్ స్నాచర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. నిందితుడిని మొయినాబాద్‌కు చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు నాగరాజును అరెస్టు చేసి విచారిస్తున్నారు.